శ్లోకం - 63
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా | విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను నీకు అత్యంత గుప్తమైన పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిని పూర్తిగా విచారించి(ఆలోచించి), నీ ఇష్టానుసారం నిర్ణయం తీసుకొనుము.