శ్లోకం - 65

మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు | మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో௨సి మే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా! నీ మనస్సు నాపై నిలుపుము. నా భక్తుడవై నన్ను పూజించుము. నన్నే సేవింపుము. నాకు నమస్కరించుము. ఈ విధముగా చేయుట వలన తప్పకుండా నన్ను పొందగలవు. నాకు ఎంతో ఇష్టుడవైన నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.