శ్లోకం - 66
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వాటి యొక్క ఫలములను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు వేడుము. నేను నీకు సర్వ పాపాల నుండి విముక్తి కలిగిస్తాను. నీవు దుఃఖించకు.