శ్లోకం - 67

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన | న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో௨భ్యసూయతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీకు ఉపదేశించిన ఈ జ్ఞానమును తపస్సు చేయని వారికి, భక్తి లేని వారికి, శ్రద్ధగా విన లేని వారికి మరియు నన్ను ద్వేషించే వారికి ఎప్పటికీ చెప్పకూడదు.