శ్లోకం - 72

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా | కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), నేను ఉపదేశించిన ఈ గీతా జ్ఞానమును నీవు ఏకాగ్రతతో విన్నావా? ఓ ధనంజయా(అర్జునా), నీ అజ్ఞానము వలన కలిగిన మోహము(భ్రమ, సందేహము) తొలగిపోయిందా?