శ్లోకం - 73

అర్జున ఉవాచ: నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత | స్థితో௨స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా(కృష్ణా), నీ అనుగ్రహము వలన నా మోహము(భ్రమ) నశించింది. నాకు నిజమైన జ్ఞానము లభించింది. ఇప్పుడు నా సందేహాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నా మనసు గందరగోళం లేకుండా స్పష్టంగా ఉంది. నీ ఆజ్ఞను తప్పక పాటిస్తాను.