శ్లోకం - 74
సంజయ ఉవాచ: ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః | సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ రాజా, ఈ విధముగా వాసుదేవుడికి(కృష్ణుడికి) మరియు మహాత్ముడైన అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణను విన్నాను. ఇది ఎంత అద్భుతముగా ఉందంటే నా రోమములు(వెంట్రుకలు) నిక్కబొడుచుకుంటున్నాయి.