శ్లోకం - 75

వ్యాసప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ | యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: వేదవ్యాసుని అనుగ్రహము వలన దివ్యదృష్టిని పొందిన నేను, అత్యంత రహస్యమైన ఈ గీతా జ్ఞానమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి చెప్పుచుండగా, నేను దానిని ప్రత్యక్ష్యముగా వినగలిగాను.