శ్లోకం - 76
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ | కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ సంవాదము ఎంతో పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ నేను ఆనందిస్తున్నాను.