శ్లోకం - 78
యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్థరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఎక్కడైతే పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారియైన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము మరియు ధర్మము ఉంటాయి. ఇది నా అభిప్రాయము.