ఎంచుకున్న రాశి

కర్కాటకరాశి

నక్షత్రాలు
పునర్వసు 4 పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు
ఆదాయం 2
వ్యయం 1
రాజపూజ్యం 4
అవమానం 7
అదృష్ట తేదీలు
2 6 11 15 20 24
అదృష్ట వారాలు
సోమవారం శుక్రవారం

వార్షిక ఫలితం

ఈ రాశి వారికి సంవత్సరాది నుండి జూన్ 1 వరకు గురుడు ద్వాదశస్థానంలో సువర్ణమూర్తిగా, అక్టోబర్ 31 వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా, జనవరి 24 వరకు ద్వితీయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు. సంవత్సరాంతం వరకు జన్మస్థానంలో రజితమూర్తిగా కొనసాగుతాడు. శని సంవత్సరమంతా భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తాడు. డిసెంబర్ 5 వరకు రాహువు అష్టమస్థానంలో, కేతువు ద్వితీయస్థానంలో తామ్రమూర్తులుగా ఉంటారు. అనంతరం రాహువు సప్తమస్థానంలో, కేతువు జన్మస్థానంలో లోహమూర్తులుగా సంచరిస్తారు.

ఈ రాశివారికి సంవత్సరారంభం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. అనేక ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతాయి. ధనవ్యయం అధికంగా ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, అలసట, ఆందోళనలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

జూన్ తరువాత కొంత ఉపశమనం లభిస్తుంది. ఓర్పు, సహనం మీకు రక్షణగా నిలుస్తాయి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఆశించినంత గుర్తింపు లేకపోయినా క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి.

స్నేహితులు, బంధువులతో అప్పుడప్పుడు విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలలో జాగ్రత్త వహించాలి. కొత్త వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు అధికారుల వలన ఇబ్బందులు, పెట్టుబడుల ఒత్తిడి ఎదురవుతాయి. అయితే సంవత్సర మధ్యకాలం తరువాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. తరచూ ప్రయాణాలు, స్థాన మార్పులు ఉండవచ్చు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. చదువులో ఏకాగ్రత కోసం కృషి చేయాలి. మధ్యస్థ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వైద్యులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు పెరుగుతాయి. ఉపాధ్యాయులు, న్యాయవాదులు వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు.

సినీ, మీడియా, ఫోటోగ్రఫీ రంగాలలో ఉన్నవారు స్థిరమైన అవకాశాల కోసం ఎదురుచూడవలసి ఉంటుంది. శ్రామిక వర్గాలకు క్రమమైన శ్రమతో ఫలితాలు లభిస్తాయి. గురు, రాహు, కేతు గ్రహ శాంతులు చేయడం, లలితా, దుర్గ, చండీ స్తోత్ర పారాయణం, దత్తాత్రేయ ఆరాధన, నవగ్రహారాధన చేయడం శ్రేయస్కరం. దీనివల్ల దుష్ఫలితాలు తగ్గి శుభఫలితాలు పెరుగుతాయి.

నెలవారీ ఫలాలు

ప్రతి నెల ఫలితం

ఏప్రిల్

కుటుంబ ఆరోగ్య సమస్యలు, శారీరక శ్రమ, మానసిక ఆందోళనలు, సంబంధాలలో అపార్థాలు, ధనవ్యయం పెరగడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి.

మే

అధికార అనుగ్రహం, కార్యసిద్ధి, బంధుమిత్రుల సహకారం, ఆర్థిక పురోగతి, కుటుంబ వ్యవహారాలలో అనుకూలత. కొన్ని ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

జూన్

ఆరోగ్య సమస్యలు, అప్పుల ఒత్తిడి, అధికార సంబంధ చికాకులు, కుటుంబ కలహాలు, ఆందోళనలు పెరగవచ్చు. నిర్ణయాలలో జాగ్రత్త అవసరం.

జూలై

వృత్తి పరంగా ప్రోత్సాహకర పరిస్థితులు, స్నేహితుల సహకారం, భూ గృహ వ్యవహారాలలో పురోగతి, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

ఆగస్టు

కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థిక లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, అధికార సహాయం, కార్యసాధనకు మంచి అవకాశాలు ఏర్పడతాయి.

సెప్టెంబర్

శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. అధికార సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

అక్టోబర్

వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, గౌరవ ప్రతిష్ఠలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖసంతోషాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి.

నవంబర్

ఆర్థిక లాభాలు, వృత్తి పురోగతి, కుటుంబ అనుకూలత, బంధుమిత్రుల మద్దతు, అధికార అనుగ్రహం, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది.

డిసెంబర్

వినోద కార్యక్రమాలు, కుటుంబ సంతోషాలు, ప్రయాణాలు, ఆస్తి వ్యవహారాలలో అనుకూలత, కార్యసిద్ధి, వాహన సౌఖ్యం లభిస్తాయి.

జనవరి

వృత్తిలో ఒత్తిడి, అధికారులతో విభేదాలు, ఖర్చులు పెరగడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం.

ఫిబ్రవరి

బంధుమిత్రుల సహకారం, ఆర్థిక పురోగతి, శుభకార్యాలు, ఉద్యోగ సంబంధ లాభాలు, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి.

మార్చి

కొత్త కార్యక్రమాల ప్రారంభం, అధికార సహాయం, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనలాభం. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.