వృషభరాశి
నక్షత్రాలువార్షిక ఫలితం
ఈ రాశి వారికి సంవత్సరాది నుండి జూన్ 1 వరకు గురుడు ద్వితీయస్థానంలో సువర్ణమూర్తిగా, అక్టోబర్ 31 వరకు తృతీయస్థానంలో లోహమూర్తిగా, జనవరి 24 వరకు చతుర్థస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తాడు. సంవత్సరాంతం వరకు తృతీయస్థానంలో లోహమూర్తిగా కొనసాగుతాడు. శని సంవత్సరమంతా లాభస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. డిసెంబర్ 5 వరకు రాహువు రాజ్యస్థానంలో, కేతువు చతుర్థస్థానంలో రజితమూర్తులుగా ఉంటారు. అనంతరం రాహువు భాగ్యస్థానంలో, కేతువు తృతీయస్థానంలో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు.
ఈ రాశివారికి సంవత్సరారంభం నుండి సుఖసంతోషాలు, ఉత్సాహం, ఆరోగ్యాభివృద్ధి కనిపిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గత కొంతకాలంగా ఎదురైన స్థబ్దత తొలగి ధైర్యంగా ముందుకు సాగుతారు. మొదటి మూడు నెలలు స్పష్టమైన ఆధిక్యం, పురోగతి కనిపిస్తుంది.
ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. భార్య, పిల్లలతో కలిసి యాత్రలు, విహారాలు చేస్తారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి ఆనందిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అధికార సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. గత విభేదాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
నూతన వస్తువులు, వాహన సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. భూ, గృహ సంబంధ ప్రయత్నాలు సంవత్సర ద్వితీయార్థంలో ఫలిస్తాయి. ఉద్యోగస్తులు క్రింది స్థాయి సిబ్బందితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వ్యాపారస్తులకు గతంలో చేసిన పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ధైర్యంగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. వ్యవసాయదారులకు యాంత్రిక పద్ధతుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధిస్తారు. అక్టోబర్ తరువాత విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లు మరియు అనుకూల స్థానాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
వైద్యులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రొఫెషనల్స్ తమ సేవల ద్వారా గుర్తింపు పొందుతారు. ప్రభుత్వ గుర్తింపు, అవార్డులు, సన్మానాలు పొందే అవకాశం ఉంది.
సినీ, కళారంగ, ఫోటోగ్రఫీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో గుర్తింపు పెరుగుతుంది. కార్మిక వర్గాలకు వేతన లాభాలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. స్థానం, ప్రభావం పెరుగుతుంది.
ఈ రాశివారు లలితా, లక్ష్మీ, చండీ పారాయణాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం శ్రేయస్కరం. దీనివల్ల దుష్ఫలితాలు తగ్గి శుభఫలితాలు పెరుగుతాయి.
నెలవారీ ఫలాలు
ప్రతి నెల ఫలితం
ఏప్రిల్
స్త్రీ విషయాల వలన చికాకులు, అధిక ధనవ్యయం, భూ గృహ ప్రయత్నాలలో ఆలస్యం, శత్రువుల వల్ల ఇబ్బందులు, వినోద కార్యక్రమాల వల్ల నష్టాలు సంభవించవచ్చు. అధికారుల జోక్యంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.
మే
శుభసంబంధ కార్యక్రమాలు, సంతృప్తికరమైన ఆదాయం, భూ గృహ వ్యవహారాల్లో కొంత అనుకూలత, అధికార సహకారం, శత్రుజయం. దూర ప్రయాణాల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది.
జూన్
ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు, భూ గృహ విషయాల్లో మందగమనం, అధికారుల వలన ఒత్తిడి, కుటుంబంలో అనుకూలత ఉన్నప్పటికీ మానసిక అశాంతి కలుగుతుంది.
జూలై
అధికార వర్గాల సహకారం, కార్యసాధన, సోదరుల వలన లాభాలు, భూ గృహ వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల మద్దతు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.
ఆగస్టు
కఠిన నిర్ణయాలు, కఠిన సంభాషణల వలన ఆదాయం పెరుగుతుంది. అధికార అనుగ్రహం, బంధుమిత్రుల సహాయం, వృత్తిలో గౌరవం, కార్యసాధనకు మంచి అవకాశాలు లభిస్తాయి.
సెప్టెంబర్
ఆరోగ్య సమస్యలు, అప్పుల ఒత్తిడి, శత్రుభయం, స్థానచలనం భయం, అనవసర ఖర్చులు, ఆప్త వియోగం, వాదోపవాదాలు పెరిగే అవకాశం ఉంది.
అక్టోబర్
కుటుంబ సౌఖ్యం, శక్తికి మించిన పనులు చేసినా మంచి ఫలితాలు, ఆర్థిక అనుకూలత, బంధుమిత్రుల సహాయం, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం, అధికారుల మద్దతు లభిస్తుంది.
నవంబర్
దుష్ఫలితాలు తగ్గి శుభఫలితాలు ప్రారంభమవుతాయి. అప్పుల విముక్తి, వృత్తిలో గౌరవం, కుటుంబ సహకారం, అధికారుల అనుకూలత లభిస్తుంది.
డిసెంబర్
సంతాన సౌఖ్యం, కుటుంబ సుఖ సంతోషాలు, వృత్తిలో అనుకూలత, అధికార సహాయం, వినోద కార్యక్రమాలు, శుభకార్యాలలో పాల్గొనడం వల్ల ఖర్చులు పెరుగుతాయి.
జనవరి
బంధుమిత్రులతో సమాగమం, ఆర్థికాభివృద్ధి, వాహన సౌఖ్యం, కుటుంబ సుఖం, మిత్ర సహాయం, అధికార అనుగ్రహం, వృత్తిలో ఆదాయవృద్ధి కలుగుతుంది.
ఫిబ్రవరి
కుటుంబ సౌఖ్యం, వృత్తిలో ప్రోత్సాహకరమైన ఆదాయం, సహనంతో వ్యవహారాల పరిష్కారం, శత్రుజయం, భూ గృహ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది.
మార్చి
దేవాలయ దర్శనాలు, ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం, అధికార సంబంధ ఆటంకాలు, కొత్త కార్యక్రమాలలో ఆలస్యం, వృత్తిలో సమన్వయం లోపించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.